ఓటీటీలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’!

5
- Advertisement -

కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ న‌టించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి, అంజ‌లి కీల‌క పాత్ర‌ను పోషించగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య లు నిర్మించారు. మే 31న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

అంతేగాదు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ పాయింట్ సాధించింది. ఇక ఈ మూవీ డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూన్ 14 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుదల కానుంది. నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది, గోపరాజు రమణ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Also Read:చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు

- Advertisement -