గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..ఓటీటీ పార్ట్‌నర్ లాక్!

12
- Advertisement -

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభించింది.

ఇవాళ భారీ అంచనాల మధ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్‌ డ్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ పార్ట్ నర్ లాక్ అయింది. ఈ చిత్రాన్ని దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

థియేట్రికల్ రన్ అనంతరం ఈ ఇంటెన్స్ డ్రామా ని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ చేసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రంలో ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ చేయగా హైపర్ ఆది, సాయి కుమార్, గోపరాజు రమణ రాజు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

Also Read:కృష్ణ బర్త్ డే..’దేవకీ నందన వాసుదేవ’ స్పెషల్

- Advertisement -