మూడు రోజుల్లోనే విశ్వక్ సేన్..బ్రేక్ ఈవెన్

8
- Advertisement -

కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇక వసూళ్లలోనూ సత్తాచాటుతోంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మూడు రోజుల్లో రూ.16 కోట్లు వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. చాలా రోజుల త‌ర్వాత‌ మంచి హిట్ కొట్టాడ‌ని ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు.

హీరోది గోదావరిలోని ఓ లంకగ్రామం. పేరు లంకల రత్నాకర్ (విశ్వక్‌సేన్‌). వృత్తి దొంగతనం. జీవితంలో ఎలాగైనా ఎదగాలనేది ఇతని లక్ష్యం. దానికోసం ఎందర్నయినా బురిడీ కొట్టించేస్తుంటాడు. ఆ ఏరియాలో.. నానాజీ(నాజర్‌), దొరస్వామిరాజు(గోపరాజు రమణ)ల ఆధిపత్యపోరు నడుస్తుంటుంది. ఆ తర్వాత ఆ వర్గానికే నాయకుడవుతాడు. దొరస్వామితోనే పోటీకి దిగి ఎమ్మెల్యే కూడా అవుతాడు. ఇక అక్కడ్నుంచి రత్న ఎలా మారాడు? నానాజీ కూతురు బుజ్జి(నేహాశెట్టి)తో ప్రేమలో ఎలా పడ్డాడు? రత్నాకర్‌కీ, రత్నమాలకీ ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమధానమే మిగిలిన కథ.

Also Read:‘మనమే’..నా ఫేవరట్ మూవీ

 

- Advertisement -