ట్విట్టర్ రివ్యూ…గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి

262
- Advertisement -

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’. విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటించగా అంజలి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలయ్య అతిథిగా రాగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కాగా సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా రివ్యూ ఇచ్చేస్తున్నారు. లంక‌ర‌త్న పాత్ర‌లో విశ్వ‌క్ సేన్ న‌ట‌న అద్భుత‌మ‌ని చెబుతున్నారు.

విశ్వ‌క్‌లోని మాస్ కోణాన్ని డిఫ‌రెంట్‌గా చూపించార‌ని…డైలాగ్స్ బాగున్నాయ‌ని మరికొంతమంది ట్వీట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ బాగుందని కొంతమంది మరికొంతమంది సెకండాఫ్ బాగుందని చెబుతున్నారు. క్లైమాక్స్‌లో తండ్రీకూతుళ్ల సన్నివేశాలు బాగున్నాయని చెబుతున్నారు. మొత్తంగా విశ్వక్ ఖాతాలో మరో హిట్ పడ్డట్లేనని తెలుస్తోంది.

Also Read:ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్..

- Advertisement -