గంగపుత్ర సంఘం పెద్దలతో ఎమ్మెల్సీ కవిత భేటీ

2
- Advertisement -

గంగపుత్ర సంఘం పెద్దలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశం అయ్యారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ , బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ముఠా జై సింహా తదితరులు కవితను కలిసిన వారిలో ఉన్నారు.

తెలంగాణ జాగృతి తరఫున బీసీ డెడికేటెడ్ కమిషన్ కి రిపోర్ట్ సమర్పించిన ఎమ్మెల్సీ కవిత కి ధన్యవాదాలు తెలిపారు నాయకులు. పలు సమస్యలను ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు గంగపుత్ర సంఘం పెద్దలు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీ లను కాంగ్రెస్ మోసం చేసిందని, ఈ అంశాన్ని శాసనమండలిలో లేవనెత్తాలని కోరారు గంగపుత్ర సంఘం పెద్దలు.

Also Read:సిగరేట్లపై 35 శాతం జీఎస్టీ!

- Advertisement -