వినాయక లడ్డూ@ రూ 2.31 కోట్లు

4
- Advertisement -

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ఇక ఈసారి ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పలు చోట్ల లడ్డూ వేలం జరిగింది. హైదరాబాద్ రిచ్‌మండ్ విల్లాస్‌లో లడ్డూను వేలంలో ఏకంగా రూ.2 కోట్ల 31 లక్షల 74 వేలకు లడ్డూను దక్కించుకున్నారు కమ్యూనిటీ సభ్యులు. గత ఏడాది ఇక్కడ కోటి 87 లక్షలు పలికింది లడ్డు.

ఇక అంతా ఎదురుచూసే బాలాపూర్ లడ్డూ వేలం పాట ఈసారి పోటాపోటీగా జరగనుంది. లడ్డూ వేలంపాటలో ఏడుగురు పాల్గొననున్నారు. చంపాపేట్ కు చెందిన మర్రి కిరణ్ రెడ్డి, జిట్టా పద్మ సురేందర్ రెడ్డి, ఎల్బీ నగర్ కు చెందిన అర్బన్ గ్రూప్ సామా ప్రణీత్ రెడ్డి, కర్మాన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్, కొత్తగూడెంకు చెందిన సామ రామ్ రెడ్డి, హైదరాబాద్ కు చెందిన పీఎస్కే గ్రూప్స్ వేలంలో పాల్గొననుంది.

Also Read:అనిల్ అంబానీపై సీబీఐ కేసు

దాదాపు పదేళ్ల నుంచి లడ్డూని సొంతం చేసుకుంటోంది కొలన్ ఫ్యామిలీ. గత ఏడాది రూ.30,01,000లకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి.

- Advertisement -