కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు..

405
Gandhi Hospital Superintendent
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న మహమ్మారి కోవిడ్‌-19(కరోనా వైరస్‌) భారత్‌లో కొన్ని రాష్ట్రాల్లో కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణలో కరోనా కేసు నమోదు అయ్యింది. కరోనా సోకిన వ్యక్తిని గాంధీ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. ఇప్పుడు అతడు కరోనా బారినుండి బయట పడి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ కానున్నాడు. తెలంగాణ ప్రభుత్వ కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. సమిష్టి కృషి వల్లె కరోనా పాజిటివ్ కేసు…నెగిటివ్ వచ్చిందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ అన్నారు.

ఈ రోజు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గాంధీలో ఉన్న పాజిటివ్ కేసు అన్నీ విధాల వైద్యానికి సహకరించాడు. అందుకే నెగిటివ్ వచ్చింది. సదరు బాధితుడు వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. గాంధీలో అందరు మూడు షిఫ్ట్ లలలొ వర్క్ చెస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం తొందరలో డిశ్చార్జ్ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన థేర్యం,ప్రోత్సహాము వలన మేము ఇది సాధించాం. కరోనా కు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ తెలిపారు.

- Advertisement -