గేమ్‌ ఛేంజర్‌…ఒరిజినల్ ఫుటేజ్‌ ఎంతో తెలుసా?

8
- Advertisement -

రామ్ చరణ్ – శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్‌ఛేంజర్‌. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. శంకర్ ఒకేసారి ఇండియన్ 2 మరియు గేమ్ చేంజర్ సినిమాలను హ్యాండిల్ చేయడంతో, రెండింటికీ న్యాయం చేయలేకపోయారని అంటున్నారు.

ఓ ఇంటర్వ్యూలో శంకర్ ఈ సినిమా 5 గంటలకు మించిన కటింగ్‌లో ఉన్నదని, తుది కట్‌తో తాను సంతృప్తిగా లేనట్లు చెప్పారు. షమీర్ ముహమ్మద్ మొదటగా ఈ చిత్రానికి ఎడిటింగ్ చేశారు. తర్వాత రుబెన్‌కి ఈ బాధ్యత అప్పగించారు. అయితే ఓ ఇంటర్వ్యూలో షమీర్ చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్‌కు గురిచేశాయి.

మొదట సినిమా మొత్తం 7.5 గంటల ఫుటేజ్‌గా ఉండేది. నేను దాన్ని 3 గంటలకు తగ్గించాను. ఆ తరువాత మరో ఎడిటర్ మరింతగా కట్ చేశాడు. శంకర్ సార్ వర్కింగ్ స్టైల్ నాకు నచ్చలేదు. అది భయానకమైన అనుభవం. అనుకున్నదానికి చాలా ఎక్కువ టైమ్ పడడంతో నేను ప్రాజెక్ట్ నుండి మధ్యలోనే తప్పుకున్నాను అని చెప్పుకొచ్చారు. షమీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దీనిపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.

Also Read:టీమిండియా కెప్టెన్‌గా గిల్..జట్టు ఇదే

- Advertisement -