గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

20
- Advertisement -

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ భారీ బ‌డ్జెట్‌తో అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

ఇక ఎప్పుడెప్పుడా అని సినిమా రిలీజ్ డేట్ గురించి ఎదురుచూస్తుండగా డిసెంబర్‌లో అని ప్రకటించారు దిల్ రాజు. డిసెంబర్‌లో అని ప్రకటించారు కానీ డేట్‌ని అనౌన్స్ చేయలేదు. అయితే తాజాగా రిలీజ్ డేట్‌ ఖరారు అయినట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ 20న థియేటర్స్ లోకి రానున్నట్లు తెలుస్తోండగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read:Harishrao: దివ్యాంగులపై స్మిత సబర్వాల్ వ్యాఖ్యలు సరికావు

 

- Advertisement -