గేమ్ చేంజర్..టీజర్

0
- Advertisement -

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో జ‌న‌వ‌రి 10, 2025న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరున్న సిటీ ల‌క్నోలో ఈ మూవీ టీజ‌ర్‌ను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ సిటీలో ఇంత గ్రాండ్‌గా టీజ‌ర్ రిలీజ్ చేస్తోన్న తొలి పాన్ ఇండియా స్టార్ రామ్ చ‌ర‌ణ్ కావ‌టం విశేషం. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైద‌రాబాద్‌ వంటి మెట్రో సిటీల్లో టీజ‌ర్ లాంచ్ కావ‌టం స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌య‌మే. కానీ తొలిసారి ‘గేమ్ చేంజర్’ టీజ‌ర్‌ను న‌వంబ‌ర్ 9న‌ ల‌క్నో విడుద‌ల చేస్తూ నిజంగానే టైటిల్‌కు త‌గ్గ‌ట్టు గేమ్‌ను చేంజ్ చేశారు.

భారీ అంచ‌నాలున్న గేమ్ చేంజ‌ర్ టీజ‌ర్ ఈవెంట్‌కు రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, డైరెక్ట‌ర్ శంక‌ర్‌ స‌హా సినీ ప్ర‌ముఖులంద‌రూ హాజ‌రుకానున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా నుంచి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, ‘జ‌ర‌గండి జ‌రగండి.. ’, ‘రా మచ్చా రా..’ సాంగ్స్‌కు ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ ద‌క్కింది. ఈ నెల 9న టీజ‌ర్ రిలీజ్ కానుంది. దీనిపై అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌లో ఉన్నాయి. అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

‘గేమ్ చేంజర్’ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ ఎన్నిక‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించే ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అవినీతి రాజ‌కీయ నాయ‌కుల నుంచి ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌టానికి ఎల‌క్ష‌న్స్‌ను నిబద్ధ‌త‌తో నిర్వ‌హించే ఆఫీస‌ర్‌గా గ్లోబ‌ల్ స్టార్ మెప్పించ‌నున్నారు. జ‌న‌వ‌రి 10న రిలీజ్ కానున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, వివేక్ రైట‌ర్స్‌గా వ‌ర్క్ చేశారు. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌. ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు. న‌ర‌సింహా రావు.ఎన్, ఎస్‌.కె.జ‌బీర్‌ లైన్ ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా అవినాష్ కొల్ల‌, యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్‌గా అన్బ‌రివు, డాన్స్ డైరెక్ట‌ర్‌గా ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ రక్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వ‌ర్క్ చేస్తున్నారు. రామ్ జోగ‌య్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్‌, కాసర్ల శ్యామ్ పాట‌ల‌ను రాశారు.

- Advertisement -