రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమాను పైరసీ చేసి ప్రదర్శిస్తున్న ఏపీ లోకల్ టీవీ నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులకు థ్యాంక్స్ చెప్పారు ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. ఈ విషయంలో పోలీసులు వెంటనే స్పందించడం సంతోషంగా ఉందని, మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేయాలని ఎస్ కేఎన్ కోరారు.
గేమ్ ఛేంజర్ పైరసీ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే చిత్ర పరిశ్రమ నుంచి మొదటగా ఎస్ కేఎన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కొన్ని నెలలపాటు వేలాది మంది కష్టపడి రూపొందించిన సినిమాను ఇలా పైరసీ చేసి ప్రదర్శించడం హేయమైన చర్య అని, పైరసీ వల్ల చిత్ర పరిశ్రమ మీద ఆధాపడిన ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తీవ్రంగా నష్టపోతారని ఎస్ కేఎన్ ట్వీట్ చేశారు. ప్రభుత్వాలు దీనిపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఎస్ కేఎన్ సోషల్ మీడియా పోస్ట్ కు నెటిజన్స్ పెద్ద సంఖ్యలో స్పందించారు.
Also Read:ఎన్టీఆర్ మూడు అక్షరాల పేరు కాదు!