- Advertisement -
గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు యువకులు మృతి చెందగా రూ.5 లక్షలు సాయం ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. ఆ ఇద్దరు చనిపోయినట్టు నాకు తెలియదు అన్నారు. ఇలాంటివి జరుగుతాయి అనే పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దు అన్నారు.. నేను చరణ్ కావాలని రిక్వెస్ట్ చేశామన్నారు. వారి కుటుంబానికి రూ.5 లక్షలు సాయం వెంటనే పంపిస్తాను అని చెప్పారు దిల్ రాజు.
రాజమండ్రి – రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి బైక్ పై వస్తుండగా వ్యాన్ ఢీకొట్టడంతో మణికంఠ (23), చరణ్ అనే యువకులు మృతి చెందారు. యాక్సిడెంట్‌లో మృతి చెందిన ఇద్దరు యువకుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు పవన్.
Also Read:గేమ్ చేంజర్..అద్భుతంగా ఉండబోతోంది:సూర్య
- Advertisement -