- Advertisement -
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది గేమ్ ఛేంజర్.
ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్‌కి అవినీతి పరుడైన మంత్రికి మధ్య జరిగే పోరాటమే ‘గేమ్ ఛేంజర్’. ఏపీ సీఎం బొబ్బిలి సత్యమూర్తితో కథ ప్రారంభం అవుతుంది. అడ్డదారిలో సీఎం అయ్యి.. అవినీతికి పాల్పడే సత్యమూర్తిలో పశ్చాత్తాపం కలిగి తన పదవీకాలం చివరి ఏడాదిలో రాష్ట్రంలో ఎలాంటి అవినీతి ఉండకూడదని నిశ్చియించుకుంటాడు. సీన్ కట్ చేస్తే వైజాగ్‌కి కలెక్టర్‌గా అడుగుపెడతాడు రామ్ నందన్ (రామ్ చరణ్). అవినీతి ప్రభుత్వంపై ఉక్కుపాదం మోపుతాడు. సీన్ కట్ చేస్తే రామ్‌నందన్‌ని సీఎంగా ప్రకటించగా ఆ తర్వాత ఏం జరుగుతుంది..కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే సినిమా కథ.
సినిమాకు ఫ్లాష్ బ్యాక్ కథే కీలకం. రామ్ చరణ్ సినిమాను తన భుజాన వేసుకుని నడిపించాడు. శంకర్ మార్క్ సందేశం, విజువల్స్, ఎమోషనల్ కనెక్టివిటీ, ఫ్లాష్ బ్యాక్‌ను గుండెలకు హత్తుకునేలా మలిచింది. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో మైండ్ బ్లోయింగ్ అనిపించారు. సెకండాఫ్‌లో అప్పన్న పాత్రే ఈ గేమ్ చేంజర్‌కు ప్రాణం. అప్పన్న పాత్రను మల్చిన తీరు, ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసిన తీరు బాగుంటుంది.
అయితే భారీ అంచనాలతో వెళితే గేమ్ ఛేంజర్‌కి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. కథ కూడా రొటీన్ ఫార్మేట్‌లోనే ఉంటుంది. లాజిక్‌లు లేని చిత్ర విచిత్రాలు గేమ్ ఛేంజర్‌లో చాలానే ఉంటాయి. ముగింపు కూడా పరమరొటీన్ మాత్రమే కాకుండా వాస్తవ దూరంగా అనిపిస్తుంది.
సాంకేతికంగా సినిమా సూపర్బ్. కథ, కథనం బాగుంది. ప్రతినాయకుడిగా ఎస్‌జే సూర్య.. విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు. జరగండి పాటలో కనిపించే విలేజ్ సెట్ కనువిందు చేస్తుంది. సాయి మాధవ్ బుర్రా మాటలు బాగున్నాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. దిల్ రాజు నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
లంచగొండుల ఆట కట్టిస్తూ శంకర్ తీసిన సినిమాలు హిట్ కొట్టాయి. అయితే గత చిత్రాలకు భిన్నంగా గేమ్ ఛేంజర్‌ను తెరకెక్కించాడు శంకర్. బ్యూరోక్రసీ వర్సెస్ పొలిటికల్ బాసిజం నేపథ్యంలో సాగిన ఎమోషనల్ డ్రామా ‘గేమ్ ఛేంజర్’. మొత్తంగా కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శంకర్ గేమ్ ఛేంజర్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యాడనే చెప్పాలి.
Also Read:వైభవంగా వైకుంఠ ఏకాదశి
విడుదల తేదీ: 10/01/2024
రేటింగ్: 3/5
నటులు:రామ్ చరణ్,కియారా అద్వానీ,ఎస్ జే సూర్య
సంగీతం: తమన్
నిర్మాత దిల్ రాజు
దర్శకుడు: శంకర్
- Advertisement -