‘గేమ్ ఛేంజర్‌’..శంకర్ మార్క్ స్పష్టంగా!

6
- Advertisement -

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ భారీ బ‌డ్జెట్‌తో అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో రామ్ చరణ్ పై ఇంట్రో సీన్స్ ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా చరణ్ ఎంట్రీ సీన్‌ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని తెలుస్తోంది.తమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిసున్నారు

Also Read:జగన్‌కు టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

- Advertisement -