గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది.
గ్లోబల్ రేంజ్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్‌తో లార్జర్ దేన్ లైఫ్ సినిమాలను రూపొందించే శంకర్ కలయికలో రాబోతున్న ఎలా ఉండబోతుందనే విషయం అందరిలోనూ ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచుతోంది. మెగాభిమానులు, సినీ ప్రేక్షకులు సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గేమ్‌చేంజర్ టీజర్, నాలుగు సాంగ్స్, వాటి మేకింగ్ చూస్తే వావ్ అనిపిస్తోంది. సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశానంటుతున్నాయి. సినిమా సెన్సార్ పూర్తి కావటం.. సినిమాకు వస్తోన్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్‌తో గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ మరింత ఉత్సాహంగా సంక్రాంతి బరిలోకి దిగుతోంది.
గేమ్ చేంజర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో ప్రొడ్యూస్ చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సరిగమ ఆడియో పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. గేమ్ చేంజర్ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.యు.వెంకటేశన్, వివేక్ రైటర్స్‌గా వర్క్ చేశారు. హర్షిత్ సహ నిర్మాత. ఎస్.తిరుణ్ణావుక్కరసు సినిమాటోగ్రఫీ, ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. నరసింహా రావు.ఎన్, ఎస్.కె.జబీర్ లైన్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా అవినాష్ కొల్ల, యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా అన్బరివు, డాన్స్ డైరెక్టర్‌గా ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వర్క్ చేస్తున్నారు. రామ్ జోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్ పాటలను రాశారు.
Also Read:కాకినాడలో గంజాయి బ్యాచ్..ఏకంగా కానిస్టేబుళ్లపైకే!