ఈ ఏడాది జరిగే టీ 20 వరల్డ్ కప్‌తో ప్రస్తుత కోచ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోచ్ పదవికి దరఖాస్తులు స్వీకరించింది బీసీసీఐ. ఇక కొత్త కోచ్ ఎవరు అన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొనగా గౌతమ్ గంభీర్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
గంభీర్‌తో పాటు ఫ్లెమింగ్, ఆండీ ఫ్లవర్ రేసులో ఉండగా గంభీర్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాతీయ జట్టుకు కోచ్‌గా చేసిన అనుభవం గంభీర్‌కు లేకున్నా.. ఐపీఎల్‌లో మెంటర్ పాత్రను పోషించిన తీరు బట్టి అతనికి హెడ్‌కోచ్‌గా బాధ్యతలు కట్టబెడతారని తెలుస్తోంది. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత జైషాతో గంభీర్ సుదీర్ఘంగా భేటీ కావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
బీసీసీఐ కోచ్ పదవికి సుమారు మూడు వేల దరఖాస్తులు రాగా షార్ట్ లిస్టు చేసిన అభ్యర్థుల జాబితాను బోర్డు త్వరలో ఇంటర్వ్యూ చేయనుంది.
Also Read:TTD: చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు