గామా అవార్డ్స్ విజేతలు వీరే..

70
- Advertisement -

దుబాయ్‌లో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ అంగరంగ వైభవంగా జరిగింది. మార్చి 3న దుబాయ్ లోని జబిల్ పార్క్ లో ప్రెస్టీజియస్ గా ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ వేడుకను ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ సారధ్యంలో గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గారు గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించారు.

టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ అవార్డ్స్ వేడుకలో 2021, 2022, 2023 లో విడుదలైన చిత్రాలనుంచి – బెస్ట్ యాక్టర్(మేల్, ఫిమేల్), బెస్ట్ మూవీ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ (మేల్, ఫిమేల్), బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్, వంటి 42 కేటగిరీలకు అవార్డ్స్ అందజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అతిరథ మహారధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి హీరోలు మంచు మనోజ్, ఉత్తమ నటులుగా ఎంపికైన.. నిఖిల్ సిద్ధార్థ, సందీప్ కిషన్, తేజ సజ్జ, ఆనంద్ దేవరకొండ, హీరోయిన్లు డింపుల్ హయతి, దక్ష నగార్కర్, ఆషిక రంగనాథ్, నేహా శెట్టి, ఫరియ అబ్దుల్లా గామా అవార్డులు అందుకోవడమే కాకుండా అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అందుకున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి గానూ.. గామా మూవీ ఆఫ్ ది డికేడ్ అవార్డును చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య అందుకున్నారు.జాతీయ పురస్కారం అందుకున్న పుష్ప ఉత్తమ చిత్రం గా, ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, ఉత్తమ చిత్రాలుగా పుష్ప, బ్రో, సీతారామం, గామా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు గా దేవి శ్రీ ప్రసాద్, తమన్, హేషం అబ్దుల్ వహాబ్, ఉత్తమ ఆల్బమ్ గా సీతారామం- విశాల్ చంద్ర శేఖర్, బెస్ట్ సింగర్స్ గా అనురాగ్ కులకర్ణి, ధనుంజయ్, హారిక నారాయణ్, ఎంఎల్ శృతి, మౌనిక యాదవ్, ట్రెండింగ్ సాంగ్ కు.. రఘు కుంచె, గామా గద్దర్ మెమోరియల్ అవార్డు నల్గొండ గద్దర్ నరసన్న, లెజెండరీ మ్యూజిక్ అవార్డ్ సంగీత దర్శకులు కోటి గారు, 25 సంవత్సరాల సంగీత దర్శకులుగా ఎం ఎం శ్రీలేఖ గామా పురస్కారం అందుకున్నారు.

గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ మాట్లాడుతూ..వేలాదిమంది తెలుగు, తమిళ, మళయాల సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్ గామా వేదిక‌పై ఇలా ప్రెస్టేజియస్ గా ఈ వేడుక నిర్వహించడం ఆనందంగా ఉంది. గామా స్థాపించినప్పటి నుండి.. గామా అవార్డు వేదికకు సహాయ, సహకారాలు అందిస్తూ.. అవార్డు ఫంక్షన్‌ను ప్రసారం చేస్తున్న ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు” అని తెలియచేశారు.

గామా జ్యూరీ సభ్యులు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు, సీనియర్ దర్శకులు వీ ఎన్ ఆదిత్య , మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ ఆధ్వర్యంలో సుమ, హైపర్ ఆది యాంకరింగ్ చేసిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సింగర్స్ తో పాటలు, హీరోయిన్ల డాన్స్ పెర్ఫార్మెన్స్, ముక్కు అవినాష్, రోహిణి కామెడీతో అలరించారు అని దర్శకులు ప్రసన్న పాలంకి తెలిపారు.

ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డు గ్రహీతలు ::

గామా బెస్ట్ యాక్టర్ 2021 – అల్లు అర్జున్ (పుష్ప)

గామా బెస్ట్ యాక్టర్ 2022 – నిఖిల్ సిద్ధార్థ (కార్తికేయ 2)

గామా బెస్ట్ యాక్టర్ 2023 – ఆనంద్ దేవరకొండ (బేబీ)

గామా బెస్ట్ హీరోయిన్ 2021 – ఫరియా అబ్దుల్లా (జాతి రత్నాలు)

గామా బెస్ట్ హీరోయిన్ 2022 – మృణల్ ఠాకూర్ (సీతారామం)

గామా బెస్ట్ హీరోయిన్ 2023 – సంయుక్త మీనన్ (విరూపాక్ష)

గామా బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ 2021 – హర్షిక రంగనాథ్ (అమిగోస్, నా సామి రంగ)

గామా బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ 2022 – దక్ష నగర్ (జాంబిరెడ్డి)

గామా బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ 2023 – డింపుల్ హయతి (ఖిలాడి)

గామా బెస్ట్ ట్రెండింగ్ యాక్టర్ – తేజ సజ్జా (హనుమాన్)

గామా మూవీ ఆఫ్ ద ఇయర్ 2021 – పుష్ప (మైత్రి మూవీ మేకర్స్.. యలమంచిలి రవి నవీన్ యెర్నేని)

గామా మూవీ ఆఫ్ ద ఇయర్ 2022 – సీతారామం (వైజయంతి మూవీస్.. స్వప్న, ప్రియాంక దత్)

గామా మూవీ ఆఫ్ ది ఇయర్ 2023 – బ్రో (పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వప్రసాద్)

గామా బెస్ట్ డైరెక్టర్ 2021 – సుకుమార్ (పుష్ప)

గామా బెస్ట్ డైరెక్టర్ 2022 – హను రాఘవపూడి (సీతారామం)

గామా బెస్ట్ డైరెక్టర్ 2023 – బాబీ కొల్లి (వాల్తేరు వీరయ్య)

గామా జ్యూరీ బెస్ట్ యాక్టర్ 2022 – విశ్వక్ సేన్ (అశోక వనంలో అర్జున కళ్యాణం)

గామా జ్యూరీ బెస్ట్ యాక్టర్ 2023 – సందీప్ కిషన్ (మైకేల్)

గామా లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ – డాక్టర్ కోటి సాలూరి (40 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)

గామా స్పెషల్ జ్యూరీ అవార్డు – ఎం ఎం శ్రీలేఖ (25 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)

గామా గౌరవ్ సత్కర్ – చంద్రబోస్ (ఆస్కార్ విన్నింగ్ ఇండియన్ లిరిసిస్ట్)

గామా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 2021 – దేవిశ్రీప్రసాద్ (పుష్ప)

గామా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 2022 – ఎస్ ఎస్ తమన్ (భీమ్లా నాయక్)

గామా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 20 23 – హేశం అబ్దుల్ వహాబ్ (ఖుషి)

గామా బెస్ట్ ఆల్బమ్ 20 22 – సీతారామం (విశాల్ చంద్రశేఖర్)

గామా బెస్ట్ లిరిసిస్ట్ 2023 – కాసర్ల శ్యామ్ (చంకీలా అంగీ లేసి దసరా)

గామా బెస్ట్ వర్సటైల్ యాక్టర్ – మురళీ శర్మ

గామా జ్యూరీ మెంబర్ – వీ ఎన్ ఆదిత్య (గామా జ్యూరీ)

గామా మోస్ట్ పాపులర్ సాంగ్ 2021 – నీలి నీలి ఆకాశం (అనూప్ రూబెన్స్)

గామా మోస్ట్ పాపులర్ సాంగ్ 2023 – పూనకాలు లోడింగ్ (దేవి శ్రీ ప్రసాద్)

గామా మూవీ ఆఫ్ ది డెకేడ్ – ఆర్ ఆర్ ఆర్

గామా మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ – నెక్లెస్ గొలుసు (రఘు కుంచె)

గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ 2021 – ధనుంజయ్ (నా మది నీదదై)

గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ 2021 – ఎం ఎల్ శృతి (అడిగా అడిగా)

గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ 2022 – హారిక నారాయణ (లాహే లాహే ఆచార్య)

గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ 2023 – చిన్మయి (ఆరాధ్య – ఖుషి)

గామా బెస్ట్ పాపులర్ సాంగ్ 2021 – మౌనిక యాదవ్ (సామి నా సామి – పుష్ప)

గామా గద్దర్ మెమోరియల్ అవార్డు : ఫోక్ సింగర్ నల్లగొండ గద్దర్ నరసన్న

గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ 2022 – అనురాగ్ కులకర్ణి (సిరివెన్నెల- శ్యాం సింగరాయ్)

గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ 2023 – రాహుల్ సిప్లిగంజ్ (ధూమ్ దాం – దసరా)

Also Read:రామేశ్వరం కేఫ్ పేలుడు..10 లక్షల రివార్డు

- Advertisement -