ఆకట్టుకుంటున్న “గం..గం..గణేశా” ట్రైలర్

10
- Advertisement -

ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – బేబి సినిమా ట్రైలర్ ను ఇక్కడే విడుదల చేశాం. అది జూలై నెల అప్పుడు వర్షం పడింది. ఇప్పుడు మే నెల. ఈ రోజు కూడా వర్షం పడింది. బేబి లాంటి సక్సెస్ గం గం గణేశాతో ఆనంద్ కు దక్కాలని కోరుకుంటున్నా. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ నుంచి వచ్చాడు తనకు హీరోగా చేయడం ఈజీ అని అనుకుంటారు. కానీ ఆ బ్యాగేజ్ మోయడం ఆనంద్ కు కష్టం. దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం చూశాక కుర్రాడు ఫర్వాలేదు అనుకున్నారు. కానీ సాయి రాజేశ్ చేసిన బేబితో ఆనంద్ కు బ్లాక్ బస్టర్ దక్కింది. ఆ సినిమాలో ఆనంద్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఓ రెండు సీన్స్ లో సూపర్బ్ అనిపించాడు. ఆనంద్, విజయ్ ఇద్దరూ వేర్వేరు దారుల్లో పయణిస్తున్నారు. మే 31న ఆనంద్ కు, మొత్తం టీమ్ కు గం గం గణేశా సూపర్ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ – గం గం గణేశాతో ఫస్ట్ టైమ్ ప్రొడక్షన్ చేస్తున్నాం. మాకు ఈ మూవీ అవకాశం ఇచ్చిన ఆనంద్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. మా సినిమా టీజర్ మీకు ఎలా నచ్చిందో ట్రైలర్ కూడా అలాగే ఇంప్రెస్ చేస్తుంది. గం గం గణేశా సాంగ్స్ కూడా ఎంజాయ్ చేసేలా ఉంటాయి. యాక్షన్ పార్ట్ లో ఆనంద్ ది బెస్ట్ ఇచ్చారు. ఈ నెల 31న గం గం గణేశా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

నిర్మాత కేదార్ సెలగంశెట్టి మాట్లాడుతూ – ఈ కార్యక్రమానికి వచ్చిన ఆనంద్ ఫ్యాన్స్ కు హాయ్ . మా సంస్థలో ఆనంద్ తో గతంలోనే సినిమా చేయాల్సింది. ఇప్పుడు తను స్టార్ అయ్యాక మూవీ చేస్తుండటం హ్యాపీగా ఉంది. గం గం గణేశాతో మంచి సక్సెస్ అందుకోబోతున్నాం. ఒక మంచి మూవీ మా సంస్థకు ఇచ్చిన మా టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ – ఎన్నికలు పూర్తయ్యాయి, ఐపీఎల్ చివరకు వస్తోంది, ఎండలు తగ్గి వర్షాలు పడుతున్నాయి. మూతపడిన కొన్ని సింగిల్ స్క్రీన్స్ మళ్లీ తెలుస్తున్నారు. ఇలాంటి రైట్ టైమ్ లో మా గం గం గణేశా మూవీ రిలీజ్ కు వస్తోంది. ఏ బిజినెస్ అయినా రైట్ టైమ్ లో చేయాలి. ఎలక్షన్స్ లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి. మా మూవీ రిలీజ్ కు కూడా ఇది సరైన టైమ్ అనుకుంటున్నాం. ఈ నెల 31న గం గం గణేశాతో పాటు మిగతా సినిమాలు వస్తున్నాయి వాటికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం. అయితే ఏ పని మొదలుపెట్టినా గణేశుడితో మొదలుపెడతారు. అలా బేబి తర్వాత ఆనంద్ ను చూసేందుకు గం గం గణేశా థియేటర్స్ కు ప్రేక్షకులు వస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

Also Read:తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే..

- Advertisement -