మల్లారెడ్డి కాలేజీలో.. “గం..గం..గణేశా” టీం

19
- Advertisement -

“బేబి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా “గం..గం..గణేశా”. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. ఈ నెల 31న “గం..గం..గణేశా” సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

“గం..గం..గణేశా” సెకండ్ సింగిల్ ‘పిచ్చిగా నచ్చాశావే’ ను మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థుల సందడి మధ్య రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ నయన్ సారిక, నిర్మాత వంశీ కారుమంచి, డైరెక్టర్ ఉదయ్ శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్, నటుడు కృష్ణ చైతన్య, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టి, సింగర్ అనురాగ్ కులకర్ణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా

జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ – మీ కాలేజ్ లో “గం..గం..గణేశా” సాంగ్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. బేబి సినిమాతో ఆనంద్ అన్న బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. మీ అందరి ఆదరణ పొందాడు. ఈ సినిమాతోనూ మిమ్మల్ని ఆకట్టుకుంటాడు. మా సినిమా సాంగ్ మీకు నచ్చితే రీల్స్ చేయండి. మనతో పాటు మన ఫ్రెండ్ కూడా పాడవ్వాలని కోరుకునే ఫ్రెండ్స్ కొందరు ఉంటారు. అలాంటి ఫ్రెండ్ గా నేను ఈ సినిమాలో కనిపిస్తా. ఈ నెల 31న “గం..గం..గణేశా” థియేటర్స్ లోకి వస్తోంది. మీరు, మీ ఫ్రెండ్స్ అంతా సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలి. అన్నారు.

నటుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ – మీ అందరి ఎనర్జీ చూస్తుంటే ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్ లో చేయబోయే సందడి కనిపిస్తోంది. మా “గం..గం..గణేశా” మూవీ నుంచి పిచ్చిగా నచ్చాశావే సాంగ్ ను మీ అందరి మధ్య రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. మా టీమ్ పై మీరు చూపిస్తున్న లవ్ కు థ్యాంక్స్. అన్నారు.

Also Read:TTD:శ్రీ‌వారి భ‌క్తుల‌కు విస్తృత ఏర్పాట్లు

- Advertisement -