గం..గం..గణేశా…రిలీజ్ డేట్

20
- Advertisement -

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “గం..గం..గణేశా”. హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం.

ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ కథానాయికగా నటిస్తుండగా నయన్ సారిక కీలక పాత్రలో కనిపించనున్నారు.చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన ఒక సాంగ్, టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ అయింది. మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో రానుంది.

Also Read:KCR:అక్కరకు రాని చుట్టం బీజేపీ?

- Advertisement -