గజ్వేల్‌లో గెలిచేది కేసీఆర్‌..వచ్చేది టీఆర్ఎస్ సర్కార్‌

224
harish rao gajwel
- Advertisement -

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ లక్ష మెజార్టీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు మంత్రి హరీష్‌ రావు. గజ్వేల్‌ నియోజకవర్గం తుప్రాన్‌లో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన హరీష్ ఈ ఎన్నికలు అభివృద్ధికి అవకాశవాదానికి జరుగుతున్న ఎన్నికలు అని తెలిపారు. ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ,కాంగ్రెస్ మహాకూటమి రూపంలో ప్రజల ముందుకువస్తున్నాయని మండిపడ్డారు.

చెయ్యి, సైకిల్‌ గుర్తులకు ఓటువేసి చేతులు నొప్పిపెట్టినా కనీసం తాగునీరు కల్పించలేకపోయారని సెటైర్లు వేసిన హరీష్‌ … తూప్రాన్ ను మున్సిపాలిటీగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. రీజినల్ రింగ్ రోడ్ తో తూప్రాన్ అభివృద్ధి వేగం పెరగనుందన్న హరీష్‌… రూ. 6 వేల కోట్లతో గజ్వేల్ లో కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వెల్లడించారు.

గజ్వేల్ లో ఇప్పటివరకు 13 మంది ఎమ్మెల్యేలు1000 కోట్లు తెస్తే కేసీఆర్ హయాంలో ఇప్పటివరకు 6వేల కోట్ల అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధికి కేరాఫ్‌గా గజ్వేల్‌ నిలిచిందన్నారు. ఈ నెల 11న ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. గజ్వేల్‌లో గెలిచేది కేసీఆర్… వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -