గజిని 2…ఇంట్రెస్టింగ్ న్యూస్!

11
- Advertisement -

మురుగదాస్ – సూర్య కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రం గజిని. 2005లో వచ్చిన ఈ చిత్రం తెలుగులోనే కాదు బాలీవుడ్‌లోనూ వసూళ్ల సునామీ సృష్టించింది. ప్రస్తుతం హిట్ సినిమాలకు సీక్వెల్‌ సినిమాలు వెండితెరపై సందడి చేస్తున్న నేపథ్యంలో గజిని 2కి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

బాలీవుడ్‌లో స్టార్ హీరో అమీర్ ఖాన్ తో మురుగదాస్ ఈ సినిమాను చేయగా ఈ సీక్వెల్ సినిమాలో కూడా అమీర్ ఖాన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి హీరో సూర్య ..హింది గజినీ పార్ట్ 2లో అమీర్ తో కనిపిస్తాను అని కంగువా హిందీ ప్రమోషన్స్ లో భాగంగా తెలిపినట్టుగా ప్రచారం జరుగుతోండగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా గజిని సీక్వెల్‌కు సంబంధించిన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read:“తల్లి మనసు” ..డబ్బింగ్ పూర్తి

- Advertisement -