TTD:24న గ‌జ‌వాహ‌న సేవ‌

1
- Advertisement -

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆల‌యంలో మార్చి 24వ తేదీ గ‌జ‌వాహ‌న‌ సేవ వైభ‌వంగా జరుగనుంది.ప్రతినెలా ఉత్త‌రాషాడ న‌క్ష‌త్రం సందర్భంగా టీటీడీ గ‌జ‌వాహ‌న‌ సేవను నిర్వహిస్తున్న విషయం విధితమే. ఇందులో భాగంగా రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై విహ‌రిస్తూ భక్తులను కటాక్షించ‌నున్నారు.

అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో మార్చి 25వ తేదీ శ్రీ‌వారి క‌ల్యాణం వైభ‌వంగా జరుగనుంది. ప్రతి నెలా శ్ర‌వ‌ణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉద‌యం 10.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామి వారికి క‌ల్యాణం నిర్వహిస్తున్న విషయం విదితమే.

Also Read:ట్రంప్ మరో సంచలన నిర్ణయం

గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహ‌స్తుల‌కు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

- Advertisement -