అధికారిక లాంఛానాలతో గద్దర్ అంత్యక్రియలు..

35
- Advertisement -

ప్రజా గాయకుడు గద్దర్‌ (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హైదరాబాద్‌లోని అపోలో స్పెక్ట్రా దవాఖానలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గద్దర్ మృతితో ప్రజల పాట మూగబోయింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు గద్దర్. ప్రజల సందర్శనార్ధం ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతికకాయాన్ని ఉంచగా ప్రజాకళాకారులు, కవులకు మరణం ఉండదన్నారు సీఎం కేసీఆర్‌. ఇక గద్దర్ భౌతికకాయానికి నివాళి అర్పించారు కేటీఆర్‌. ఇక ఇవాళ అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి.

11 గంటలకు గద్దర్ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుండి మొదలుకానుంది. అంతిమయాత్రలో కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొననున్నారు. ఎల్బీ స్టేడియం నుండి బషీర్ బాగ్ చౌరస్తా, జగ్జీవన్ రామ్ విగ్రహం మీదుగా గన్ పార్క్ వైపు సాగనున్న అంతిమయాత్ర సాగనుంది. గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద గద్దర్ పార్థీవదేహం ఉంచి పాటలతో నివాళులు అర్పించనున్నారు కళాకారులు. అనంతరం భూదేవినగర్ లోని గద్దర్ నివాసానికి అక్కడి నుండి మహాభారతి విద్యాలయం అవరణలో గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి.

Also Read:పొత్తుకు పవన్ వెనుకడుగు.. కారణం అదే?

గద్దర్‌ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ గ్రామంలో ఓ నిరుపేద దళిత కుంటుంబంలో 1949 జూన్‌ 5న శేషయ్య, లచ్చమ్మ దంపతులకు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచి పోరాట భావాలు కలిగిన గద్దర్‌.. తెలంగాణ వెనుకబాటుతనాన్ని, వలస పాలకుల ఆధిపత్యంలో శిథిలమవుతున్న తెలంగాణ జీవనచిత్రాన్ని కళ్లారా చూశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే సమస్యలన్నింటికీ పరిష్కారమని భావించి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

Also Read:Dasoju Sravan:గద్దర్ మృతితో ఒక శకం ముగిసింది

- Advertisement -