తెలంగాణ ద్రోహి..రేవంత్ రెడ్డి: గాదరి కిషోర్

2
- Advertisement -

ఈ నెల 20 న సూర్యాపేట జిల్లా కేంద్రంలో brs వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హాజరుకానున్న ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాట్లను పరిశీలించారు బీఆర్ఎస్ నేతలు మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్.

ఈ సందర్భంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 27 న వరంగల్ లో BRS భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం KTR గారు జిల్లల్లో కార్యకర్తల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు… మొదటగా ఈ నెల 20 న సూర్యపేట జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహిస్తున్నాం అన్నారు.

మనం కేసీఆర్ నాయకత్వాన్ని ,పార్టీని కాపాడుకోవాలి ..రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోంది.. రేవంత్ అనేటోడు నీచ నికృష్ట మైన పాలన చేస్తూ ప్రజలను ఎడిపిస్తున్నాడు.. కేసీఆర్ మాకు జాతిపిత…కేసీఆర్ ను మాటలు అనేంత స్థాయి, అర్హత రేవంత్ రెడ్డి కి లేదు.. పార్టీ స్థాపించి,అలుపెరగని పోరాటం చేసి, చావు నోట్లో తల పెట్టి తెలంగాణను సాధించిన దిరోదాత్తుడు మా కేసీఆర్.. ముమ్మాటికీ తెలంగాణ జాతిపిత కేసీఆర్.. రేవంత్ అనే వ్యక్తి తుపాకీతో తెలంగాణ వాదులను బెదిరించిన నిచుడు..తెలంగాణ ద్రోహి రేవంత్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:అందాల పోటీలు ఎందుకు?: కేటీఆర్

సూట్‌కేసులతో అడ్డంగా దొరికిన దొంగ వాడు…అసెంబ్లీ సాక్షిగా పచ్చి భూతులు మాట్లాడుతున్నాడు.. జర్నలిస్టుల ను బట్టలు విప్పి కొడతా అంటున్నాడు… కేసీఆర్ గారిని అనరాణి మాటలు అంటున్నాడు.. రేవంత్ మాటలపై ఏ ఒక్కడు మాట్లాడడు.. కుహనామేదా వులు ఎక్కడికి పోయారు.. ఎందుకు స్పందించడం లేదు…జగదీష్ రెడ్డి అసెంబ్లీ ఉంటె చీల్చిచెండాడుతాడు అని కుట్ర చేసి సస్పెన్షన్ చేశారు.. అనని మాటలు అన్నట్లు అబుతకల్పాన చేశారు..స్పీకర్ ను పదే పదే దళితుడు అంటూ కాంగ్రెస్ నాయకులు అవమాణిస్తున్నారు….జగదీష్ రెడ్డి బలహీనవర్గాల నేత.. ఆయనపై అభాండాలు వేస్తే సూర్యాడిపై ఉమ్మి వేసినట్లే….ఉస్మానియా పెరు చెబితే రేవంత్ కు వణుకు వస్తోంది. అందుకే అక్కడ ధర్నాలు చేయొద్దు అని సర్క్యులర్ ఇచ్చాడు.. పిరికొడు రేవంత్ రెడ్డి.. ఉస్మానియా చుట్టుపక్కల కు వస్తే రేవంత్ ను తన్ని తరిమేస్తారు..రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి అంటే ప్రభుత్వం లో చలనం లేదు..రైతులు చస్తున్న పట్టింపు లేదు….. రాష్ట్రంలో అన్నదాతలు కన్నీళ్లు పెడుతున్నారు అన్నారు.

- Advertisement -