క‌రోనాపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించిన గాద‌రి కిశోర్

284
gadari kishore
- Advertisement -

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామ చౌరస్తాలో కరోనా మహమ్మారి బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అవగాహన కల్పించారు స్ధానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్.

అధికారులు,వైద్య సిబ్బంది,పోలీసులతో మాట్లాడుతూ బయటి ప్రాంతాల నుండి వస్తున్న ప్రజలకు కరోనా వైరస్ పైన అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.

పక్క రాష్ట్రాల నుండి బయటి దేశాల నుంచి వచ్చిన ప్రజలను ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు నిర్వహించి వాళ్ళు ఇంట్లో నుండీ బయటికి రాకుండా జాగ్రత్త వహించాల‌న్నారు. ప్రజలు అనవసరంగా రోడ్ల మీద తిరుగుతున్నారు వారి పైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -