కాళేశ్వరం జలాలు ఏవీ?:గాదరి కిషోర్

7
- Advertisement -

ఖబడ్దార్ రేవంత్ రెడ్డి.. ముందు కాళేశ్వరం జలాలు ఇచ్చి తుంగతుర్తిలో అడుగుపెట్టు. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావ్? నీళ్లు లేక తుంగతుర్తి రైతులు విలపిస్తున్నారు. రైతుల గోడు కనపడటం లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. తిరుమల గిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కిషోర్.. ఖబడ్దార్ రేవంత్ రెడ్డి, ముందు కాళేశ్వరం జలాలు ఇచ్చి తుంగతుర్తిలో అడుగుపెట్టు అని సవాల్ విసిరారు.

బిడ్డా రేవంత్ రెడ్డి.. తుంగతుర్తి చైతన్యవంతమైన గడ్డ. నీకు తప్పకుండా గుణపాఠం చెప్తారు. రేవంత్ ఈ నెల 14న తుంగతుర్తికి వస్తున్నడు. అసలు తుంగతుర్తిలో అడుగు పెట్టే అర్హత ఆయనకి లేదు. ఎన్నికల ప్రచారంలో తుంగతుర్తికి వచ్చి ఫేక్ బాండ్ లు ఇచ్చి, హామీలు ఇచ్చి, అందరినీ పచ్చి మోసం చేసాడు. ముందు వాటికి సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడి స్థానిక ఎమ్మెల్యేకు సోయి లేదు. ఆయన దళిత ద్రోహి. దళిత బంధు నిధులు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడు. తుంగతుర్తిలో అడుగడుగునా అవినీతి, రౌడీ రాజ్యం నడుస్తుంది అన్నారు.

నియోజకవర్గం రూ. 1200 కోట్లతో అభివృద్ధి చేసేసిన అని గఫ్ఫాలు కొడుతుండు..దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చెయ్. మిస్టర్ సామేల్.. ఏవీ పనులు? ఏవి GOలు? ఏవి ఫండ్స్? దమ్ముంటే వాటిని చూపించు. సవాళ్లు విసురుడు పలాయనం చిత్తగించుడు రేవంత్ కి అలవాటే. రేవంత్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ను పబ్ అని దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. జర్నలిస్టుల మనోభావాలను కించపరుస్తుండు. పొద్దున లేస్తే రైతు సంక్షేమం అంటుండు. దా.. దమ్ముంటే చర్చిద్దాం రా.. ఎక్కడ రైతులు సంతోషంగా ఉన్నారో తెలుసుకుందాం. ఎమ్మెల్యే సామెల్ సొంత ఊరు అడ్డ గూడూర్ మండలం ధర్మారం గ్రామం పోదాం, అక్కడ రుణమాఫీ కాలేదు. రైతు భరోసా రాలేదు. కళ్యాణ లక్ష్మి రావడం లేదు. ఏ ఉరికైనా పోదాం పద, ఎక్కడా సంక్షేమ పథకాలు అందడం లేదు అన్నారు.

భువనగిరి ఎంపీ లెస్స మాట్లాడుతున్నాడు. ఆయన ముఖం కూడా ఎవ్వరికీ తెలియదు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పది ఓట్లు రాలే. ఆయన సొంత ఊరిలో కూడా ఎవ్వరికీ రుణమాఫీ కాలేదు. మంత్రి ఉత్తమ్ సొంత ఊరిలో కూడా రుణమాఫీ కాలేదు. ఎక్కడైనా చర్చకు రెడీ. రేవంత్, కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. బేసిన్ ల గురించి కూడా తెలియని దద్దమ్మ రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లాలో లక్షా 25 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినం. సస్యశ్యామలం చేసినం. ఇప్పటికి కూడా కన్నెపల్లి పంప్ లు ఆన్ చేస్తే పుష్కలంగా సాగు నీళ్లు ఇవ్వొచ్చు అన్నారు.

Also Read:ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెల్లించాలి

కావాలని కక్షతో ఈ దద్దమ్మలు నీళ్లు ఇవ్వడం లేదు. రైతుల ఉసురు తీసుకుంటున్నారు. ఈ అసమర్థ నాయకులతో తెలంగాణ ఆగం అయింది. నోటికి వచ్చిన హామీలను ఇచ్చి అందరినీ మోసం చేశారు. తుంగతుర్తిలో నేను తెచ్చిన నిధులకు, పనులకు కొబ్బరికాయలు కొడుతూ పబ్బం గడుపుతున్నడు స్థానిక ఎమ్మెల్యే. అంతేకాని ఒక్క కొత్త అభివృద్ధి పని కాలేదు. పొద్దున్న లేస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడమే ఆయన పని. కేసులతో అందరినీ భయపెట్టి తిరుగుతుండు. దళితుడుగా పుట్టి దళిత బంధు నిధులు అడ్డుకుంటూ ద్రోహిగా మిగిలిపోయాడు అని దుయ్యబట్టారు.

- Advertisement -