ఓయూలో ర్యాలీలపై నిషేధమా?

16
- Advertisement -

ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు , ర్యాలీలు నిషేధం విధించడం పై తీవ్రంగా మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. ఉస్మానియాలో ధర్నాలు నిషేధించడం రేవంత్ నిరంకుశ పాలనకు నిదర్శనం అన్నారు. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాలో నిరసన చేసే హక్కుని కాలరాయడం సిగ్గుమాలిన చర్య అన్నారు.

అందరి పై నిర్బంధం పెట్టి భయ భ్రాంతులకు రేవంత్ గురి చేస్తున్నారని మండిపడ్డారు. వైఫల్యాల పై ఉస్మానియాలో రేవంత్ దిష్టిబొమ్మలు కాలుతున్నాయని కుట్రతో నిషేధాజ్ఞలు పెడుతున్నారు అన్నారు.

గతంలో కేసీఆర్ కి వ్యతిరేకంగా నిరసనల కోసం ఉస్మానియాని వేదిక చేసుకున్న రేవంత్ ఇప్పుడు మాత్రం అడ్డుకుంటున్నాడు.. భవిష్యత్ రాజకీయాలకు నేతలను తయారు చేసే ఫ్యాక్టరీ ఉస్మానియా అన్నారు. నిషేదాజ్ఞల నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకోవాలి.. నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే మరో ఉద్యమం తప్పదు అని హెచ్చరించారు.

Also Read:బీసీ ప్రజాప్రతినిధులతో పొన్నం భేటీ

- Advertisement -