కేటీఎం బైక్‌ షో రూమ్ ప్రారంభించిన డీటీసీ..

25
ktm bike show room

ఈ రోజు గచ్చిబౌలిలో డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్(ఐటి,ఎన్ఫోర్స్మెంట్, అడ్మిన్స్టేషన్).. కె పాపారావు చేతుల మీదుగా KTM-Husqvarna ద్విచక్ర వాహనాల షో రూమ్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించబడినది. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ.. బైక్‌లు ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యావసరం అయినది. కాలేజీకి వెళ్ళే విద్యార్థులకు, వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అత్యంతావసరంగా బైక్ ల వినియోగం వుందని చెప్పారు.కస్టమర్ లను ఆకట్టుకోవడానికి మంచి సర్వీసును,నాణ్యతను పాటించాలని సూచించారు.

కేటీఎం బైక్‌లో రకరకాల మోడల్స్ ఈ విధంగా వున్నాయి. డ్యూక్ 125,200,250,390,790… అడ్వెంచర్ 250,390… అలాగే హస్క్వర్ణ లో స్వార్ట్పిలెన్250,విట్పిలెన్ 250 అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బజాజ్ ఆటో లిమిటెడ్ కంపెనీ స్టేట్ హెడ్ సేల్స్ కార్తికేయ వాడ్రేవు, స్టేట్ హెడ్ సర్వీసు అనిల్ కుమార్ నందం, ఏ.వి.సత్యనారాయణ చైర్మన్, అన్నే నవీన్ యం.డి ఎస్&ఎస్ గ్రూపు మొదలగు వారు పాల్గొన్నారు.