జనసేనానితో గబ్బర్‌సింగ్ బ్యాచ్‌

251
pawan gabbarsingh batch
- Advertisement -

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీకి రోజురోజుకి సినీగ్లామర్ పెరిగిపోతోంది. పవన్‌తో పాటు మెగా బ్రదర్ నాగబాబుకు ఎన్నికల బరిలో ఉండటంతో వారి తరపున ప్రచారం చేసేందుకు మెగా ఫ్యామిలీతో పాటు జబర్దస్త్ టీం సిద్ధమవుతోంది. ఇప్పటికే హైపర్ ఆది నాగబాబు తరపున ప్రచారంలో దూసుకుపోతుండగా తాజాగా గబ్బర్ సింగ్ టీం చేరిపోయింది.

పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో పేరడీ సాంగ్స్ తో అదరగొట్టిన బ్యాచ్ జనసేనకు ప్రచారం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ జనసేనకు ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం గబ్బర్ సింగ్ బ్యాచ్, మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ ను కలిశారు. ప్రచారం గురించి, రాజకీయాల గురించి పవన్ తో మాట్లాడారు. పవన్ తో గబ్బర్ సింగ్ టీం దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరోవైపు వరుణ్ తేజ్, నిహారికలు నాగబాబు తరపున ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. నిహారిక హీరోయిన్ గా చేసిన సూర్యకాంతం సినిమా మార్చి 29 న రిలీజ్ కు సిద్ధం అవుతున్నది. ఈ సినిమా రిలీజ్ తరువాత నిహారిక తండ్రి తరపున చేయనుండగా వరుణ్ తేజ్ సైతం త్వరలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారట. మొత్తంగా మరికొద్దిరోజుల్లో సినీగ్లామర్‌తో ఎన్నికల ప్రచారం మరింత హోరెత్తనుంది.

- Advertisement -