పవన్ కల్యాణ్‌ను వాడుతున్న వెంకీ…

259
Venky using pawan kalyan in guru movie
Venky using pawan kalyan in guru movie
- Advertisement -

గురు సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు చోటు ఉందా? అంటే అవుననే అంటోంది చిత్ర యూనిట్. వెంకీ, పవన్ కల్యాణ్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఇద్దరు గోపాల గోపాల చిత్రంలో కలిసి నటించారు. ఈ క్రమంలో గురు చిత్రంలో కూడా అదే సెంటిమెంట్ కొనసాగిస్తున్నాడట వెంకటేష్‌. ఇంతకీ గురు మూవీలో పవన్ నిజంగానే నటిస్తున్నాడా? ఇది చదవండి..

హిందీ చిత్రం సాలాఖడూస్ కి రీమేక్ గా వస్తున్న గురు చిత్రంలో వెంకీ ఓ బాక్సర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ పేద అమ్మాయిని బాక్సర్ గా తీర్చదిద్దే పాత్రలో వెంకీ కనిపించబోతున్నాడు. బాక్సింగ్ నేర్చుకునే అమ్మాయిగా మాతృకలో రితికా సింగ్ నటించింది. తెలుగులో కూడా ఆమె ఈ పాత్ర చేస్తోంది.కథారీత్యా ఈ సినిమాలో రితికా సింగ్ పాత్రకు ఒక అభిమాన హీరో ఉంటాడు.

gopala_0_0

అందుకోసం పవన్ కల్యాణ్ పేరు వాడాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందట. పవన్ తో ఉన్న స్నేహం కారణంగా ఆయన పేరును వాడాల్సిందిగా వెంకటేష్ సూచించినట్లు తెలుస్తోంది. వెంకీ, పవన్ కల్యాణ్‌ కు మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది. ఇద్దరు కలిసి గోపాల గోపాల మూవీలో కలిసి నటించారు కూడా. ఇలా సినిమాల్లో హీరోల పేర్లు వాడడం టాలీవుడ్ లో ఎప్పటి నుంచో సెంటిమెంట్ గా ఉంది. అయితే గతంలో ఎక్కువగా చిరంజీవి పేరు ఇలా సినిమాల్లో వాడేవారు. ఆ తరువాత చిరు సినిమాలకు దూరమయ్యాక ఆయన పేరు మళ్లీ ఏ సినిమాలో వినిపించలేదు. మొత్తానికి ఏమైతేనేం ఇప్పుడు అన్నయ్య స్థాయికి పవన్ కూడా ఎదిగాడు.

Guru-First-look-poster-photos-pics-stills-1

- Advertisement -