ర‌ష్యాకు జీ7 వార్నింగ్‌ ఎందుకో తెలుసా…

189
- Advertisement -

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రష్యా ఉక్రెయిన్‌ దాడి ప్రారంభించనప్పటినుంచి ఇప్పటివరకూ ఇరుపక్షాల మధ్య తీవ్ర నష్టం జరిగింది. అయితే గత నాలుగైదు రోజులుగా రష్యా తన అధిపత్యంను కొనసాగించడానికి ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున్న బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌ రష్యాల మధ్య జరుగుతున్న యుద్ద నేపథ్యంలో జీ7దేశాలు వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీ7దేశాలు పుతిన్‌కు వార్నింగ్‌ ఇచ్చాయి.

రష్యా ఒకవేళ అణ్వాయుధాలు వాడితే తీవ్ర పరిణామాలు ఏదుర్కొవాల్సి వస్తుందని హెచ్చిరించాయి. రష్యా మిసైల్‌ దాడులను ఖండించిన జీ7దేశాలు ఉక్రెయిన్‌కు తక్షణ సైనిక, రక్షణ అవసరాలు సామాగ్రిని చేరవేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఇదే సందర్భంలో ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమ‌ర్ పుతిన్‌తో చ‌ర్చ‌లు జ‌రిపే ప్ర‌స‌క్తి లేద‌ని జీ7 సభ్యదేశాలు తెల్చి చెప్పాయి.

ర‌ష్యాను నిలువ‌రించేందుకు ఉక్రెయిన్‌కు గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ సామ‌ర్ధ్యాల‌ను క‌ల్పించాల‌ని జీ7 దేశాల‌కు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ అభ్య‌ర్ధించారు. మాస్కోపై క‌ఠిన  ఆంక్ష‌లు విధించాల‌ని జీ7 స‌మావేశంలో జెలెన్‌స్కీ కోరారు.

2014లో క్రిమియాను అక్రమించుకోవడంతో ఉక్రెయిన్‌ రష్యాల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. తాజాగా రష్యా క్రిమియాల మధ్య ఉన్న కెర్చ్‌ వంతెనను కూల్చివేయడంతో ఈ దాడులు తీవ్రతరం చేశామని ఐక్యరాజ్యసమితి లో మాస్కో  తెలిపింది.

- Advertisement -