భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే: రేవంత్ రెడ్డి

10
- Advertisement -

భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి అన్నారు.

హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి.. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుంది..మైక్రోసాఫ్ట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెడుతున్నాం అన్నారు. హైదరాబాద్ లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ తో MOU చేసుకుంటున్నామని వెల్లడించారు సీఎం.

Also Read:ప్రభుత్వంపై రైతుసంఘాల ఫైర్

- Advertisement -