మున్సిపాలిటీలకు నిధులు విడుదల

4
- Advertisement -

మున్సిపాలిటీలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.2,780 కోట్లు విడుదల చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2432 పనులకు ఆమోదం తెలిపింది.

వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీల్లో పనులకు ప్రాధాన్యం ఇచ్చారు.

తెలంగాణ కోర్ అర్బన్ సిటీని మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు వెంటనే నిధులు విడుదల అయ్యాయి. తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రమంతటా ఉన్న పట్టణాలను గ్రోత్ హబ్‌లుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

Also Read:ఓటీటీలోకి ఇడ్లీ కొట్టు!

- Advertisement -