వైరల్‌ అవుతున్న “సవ్యసాచి” సాంగ్

359
- Advertisement -

చందు మొండేటి, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం “సవ్యసాచి”.
తెలుగులో ఇంతవరకు రాని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాలో నాగ చైతన్య, నిధి అగర్వాల్
జంటగా నటిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో
సినిమాకు సంబంధించిన పనులు పూర్తి చేస్తున్నారు యూనిట్.

ఇటీవలే రెండు పాటలు రిలీజ్ చేసిన మూవీ యూనిట్ తాజా మరో సాంగ్ ను విడుదల చేశారు. మాధవన్,
భూమికలు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు శివదత్తా, రామకృష్ణ కోడూరి లిరిక్స్ అందించగా.. 16
మంది కోరస్ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా విడుదలైన సాంగ్ కూడా
నెట్‌లో వైరల్ అవుతోంది.

- Advertisement -