చలికాలంలో ఈ పండు తింటే..!

145
- Advertisement -

రోజురోజుకూ చలి తీవ్రత పెర్రుగుతోంది. ఈ చలికాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల కరణంగా చాలా మంది తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. ముఖ్యంగా సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరాలు, తలనొప్పి, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు చలికాలంలో అధికంగా వేదిస్తాయి. అయితే ఈ సమస్యలను అయితే ఈ సమస్యలను దూరం చేసుకోవడానికి ఎన్నో రకాల మెడిసన్స్ వాడుతూ ఉంటాము. అయితే చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను నయం చేసే గుణాలు కొన్ని రకాల పండ్లలో కూడా ఉంటాయి. అలాంటి ఓ రకానికి చెందినదే అంజిరా పండు. ఈ పండు ఎన్నో ఔషధ గుణాల మిశ్రమం..

ఈ పండులో అధిక శాతంలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా సమృద్ది గా ఉంటాయి. అందువల్ల సీజనల్ గా వాచ్చే జలుబు, ఫ్లూ జ్వరాలు, వంటి రోగాలను అంజిరా పండు దరిచేరనివ్వదు. ఈ పండు తినడం వల్ల చలికాలంలో శరీరానికి కావలసిన వేడిని అందిస్తుంది. అంతే కాకుండా రోగ నిరోదక శక్తిని పెంపొండించడంలో కూడా అంజిరా పండు కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల సీజనల్ గా వాచ్చే ఇన్ఫెక్షన్స్ బారిన పదకుండా ఉంటాము. అలాగే ఇందులో ఉండే పోషకాలు శ్వాస వ్యవస్థను కూడా మెరుగు పరుచుతుంది. ముఖ్యంగా కఫం, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతే కాకుండా పొడి దగ్గు వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే చర్మాన్ని తేమగా ఉంచుతూ శరీర సమతుల్యతకు దోహద పడుతుంది. అందువల్ల చలికాలంలో సీజనల్ రోగాల బారిన పదకుండా అంజిరా పండు తినడం ఎంతో శ్రేయస్కరం అని నిపుణులు చెబుతున్నారు.

Also Read:బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజంటేషన్

- Advertisement -