విమాన టిక్కెట్ల కోసం కొత్త రూల్స్‌..

221
From now on, govt ID a must to book domestic flights
- Advertisement -

ఇప్పటివరకూ విదేశీ ప్రయాణానికి పాస్ పోర్టు అవసరం ఉండగా, స్వదేశంలో ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకునే వేళ, ఎటువంటి ఐడీ కార్డు అవసరం ఉండదన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియకు కేంద్రం పుల్‌స్టాప్‌ పెడుతోంది. దేశీయ విమానయానంపై కేంద్రం కొత్త ఉత్తర్వులు జారీ చేయనుంది.

ఇకపై విమానం టికెట్ బుక్ చేసుకునే వేళ, ఐడీ కార్డు నకలును జతపరచాల్సిందేనని, దేశీయ ప్రయాణానికి ఆధార్ కార్డు ఉండాలని లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి తప్పనిసరని విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా వెల్లడించారు.

 From now on, govt ID a must to book domestic flights

మంగోలియాలో విమానయాన భద్రతపై ఓ సదస్సు జరుగగా, అందులో పాల్గొని వచ్చిన ఆయన ‘నో ఫ్లయ్’ జాబితాపై నిబంధనలను రూపొందించినట్టు కూడా తెలిపారు. వీటిని శుక్రవారం నాడు విడుదల చేయనున్నామని, ఈ జాబితాలోని వారు మారు పేర్లతో టికెట్లను కొనుగోలు చేయకుండా చూసేందుకు సాధ్యమైనంత త్వరలో డిజిటల్ బోర్డింగ్ కార్డులను కూడా ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఇందుకోసం ఆధార్ కార్డులను ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుందని అన్నారు.

విమానాల భద్రత, అవాంఛనీయ ఘటనల నివారణ లక్ష్యంగా నో ఫ్లయ్ జాబితా నిబంధనలను తయారు చేసినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చీఫ్ బీఎస్ బుల్హార్ తెలిపారు. వచ్చే సంవత్సరం జూలై నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రావచ్చని వెల్లడించారు.

- Advertisement -