అమెరికాలో మరో తెలుగు యువకుడు దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం అర్థరాత్రి అమెరికాలోని కన్సాస్ సిటి బార్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో కూచిభొట్ట శ్రీనివాసరావు అనే వ్యక్తి మరణించాడు. కాల్పులను అడ్డుకోడానికి ప్రయత్నించిన మరో ఇద్దరిపైనా కూడా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. శ్రీనివాస్‌ను రక్షించడానికి ప్రయత్నించిన అలోక్ మదశానీ, ఇయాన్ గ్రిల్లెట్‌లు కూడా ఈ కాల్పుల్లో గాయపడ్డారు.
తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌తో సహా వీరిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. అయితే శ్రీనివాస్ చికిత్స పొందుతూ మరణించాడని, అలోక్, గ్రిల్లెట్ పరిస్థితి నిలకడా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తునకు ఎఫ్‌బీఐ సహకారం తీసుకుంటామని తెలిపారు. కూచిభొట్ల శ్రీనివాస్, ఆలోక్‌లు జీపీఎస్ మేకర్ గార్మిన్‌లో ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం ఈ రోజు హైదరాబాద్‌కు రానుంది. రాత్రి 8:45 గంటలకు శ్రీనివాస్ మృతదేహం శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటుంది. బొల్లారం ఖాజీపల్లిలోని శ్రీనివాస్ స్వగృహానికి మృతదేహం తరలిస్తారు. రేపు కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహానికి మహాప్రస్తానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత తెలుగువాళ్లపై విద్వేషదాడులు జరుగుతున్నాయి. అమెరికాలో తెలుగువారు ఉండకూడదనే నెపంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని స్పష్టంగా అర్ధమవుతోంది. తాజాగా మరో భారతీయుడి ఇంటిపై దాడి చేసి, తమ అక్కసును బయటపెట్టుకున్నారు అమెరికాన్లు.
అమెరికాలోని దక్షిణ కొలరాడోలో తెలుగువాడిపై దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పీటన్ నగరంలోని ఓ భారతీయుడి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.అనతరం ఆ ఇంటిపై దాదాపు 50కి పైగా పేపర్ పోస్టర్లు అతికించడంతో పాటు, గోడల మీద కోడిగుడ్లు విసిరికొట్టడం, ఎక్కడ పడితే అక్కడ గోడలకు కుక్కల అశుద్ధం పూయడం లాంటి దారుణాలకు పాల్పడ్డారు. తలుపు మీద, కిటికీల మీద, కారు అద్దాల మీద కూడా పోస్టర్లు అతికించారు. వాటిలో.. ”గోధుమ వర్ణం చర్మం వాళ్లు, లేదా ఇండియన్లు ఇక్కడ ఉండద్దు” అనే అర్థం వచ్చేలా సందేశాలు రాశారు.
ఈ దాడికి గురైన భారతీయుడు మాత్రం తన పేరు బయటపెట్టడానికి ఇష్టపడలేదు, కెమెరా ముందుకు కూడా రావడంలేదు. అయితే ఇంత పెద్ద మొత్తంలో పోస్టర్లు అతికించడం, అశుద్ధం వేయడం, కోడిగుడ్లతో కొట్టడం లాంటివి జరిగాయంటే ఇది ఎవరో ఒకరిద్దరి పని కాదని, పెద్ద గుంపే వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ఇలా అమెరికాలో క్రమ క్రమంగా తెలుగువారిపై దాడులు పెరిగిపోతున్నాయి. అమెరికాలో నివాసంచే తెలుగు ప్రజలు బిక్కు బిక్కు మంటూ బ్రతకాల్సి వస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి జరుగుతోందో అని తెలుగువారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అమెరికా నుంచి మూడు లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరుగు ప్రయాణమైయ్యారు.
ఇప్పటికే ఈ ఘటనపై కేంద్రమంత్రులు,రాష్ట్ర మంత్రులు స్పందించారు….ఇలాంటి ఘటనలు అమెరికా ప్రభుత్వానికి మంచిది కాదని వారు సూచించారు. ఇలాంటి పరిణామాలను మొగ్గలోనే తుంచివేయాలని వారు పేర్కొన్నారు.