ప్రజలకు ఉచితపథకాలు ప్రమాదమే!

19
- Advertisement -

ప్రస్తుతం ఎక్కడ చూసిన రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలు కూడా ఉచిత పథకాలకు మెల్లగా అలవాటు పడుతున్నారు. ఈ పరిణామాలు ఏ మాత్రం మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రజలకు అసవమైనవి తప్పా మిగిలినవేవీ ఉచితంగా ఇవ్వరాదని సూచిస్తున్నారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు నెలకు రూ.1500, రూ.500 లకే గ్యాస్.. ఇలా చాలానే ఉచిత హామీలు ప్రకటించి అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తాయని విశ్లేషకులు మొదటి నుంచి కూడా చెబుతూ వస్తున్నారు. .

అటు ఏపీలో కూడా ఈ ఉచిత హామీల పరంపర కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఉన్న టీడీపీ భారీగా ఉచిత పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉచిత బస్సు ప్రయాణం. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు నెలకు రూ.2 వేలు.. ఇలా ఆయా హామీలను ప్రకటించింది. అయితే ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ఆర్థికవృద్ది దెబ్బ తింటుందని తెలిసినప్పటికి పార్టీలు మాత్రం హామీలు ఇవ్వడం మానడంలేదు. ఉచిత పథకాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ” ప్రజలకు విద్యా, వైద్యం మినహా మిగిలినవేవీ ఉచితంగా ఇవ్వడం మంచి పరిణామం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఉచిత పథకాల హామీలు తగ్గినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా ఏడుగుతుందని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. మరి ముందు రోజుల్లో ఈ ఉచిత పథకాల హామీలను పార్టీలు తగ్గిస్తాయా ? లేదా ఒట్లే లక్ష్యంగా హామీల డోస్ ఇంకాస్త పెంచుతాయా ? అనేది చూడాలి.

Also Read:సంక్రాంతి విన్నర్ ఎవరో తేలిపోయిందిగా!

- Advertisement -