- Advertisement -
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతుండగా రోజుకు రికార్డు స్ధాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ పేషెంట్లందరికీ ఫ్రీగా రెమ్‌డెసివర్ ఇంజక్షన్లను ప్రభుత్వమే ఇవ్వనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
పేషెంట్‌కు ఆ ఇంజెక్షన్ తప్పనరిసరి అయితే వాళ్లకు కూడా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్‌లే ఇంజెక్షన్‌ను అందించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వం, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చేరే అందరికీ ఇది వర్తిస్తుంది. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం రెమ్‌డెసివిర్‌ను కంపెనీల నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది. యూపీకి కేంద్రం కూడా రెమ్‌డెసివిర్ కోటా పెంచింది. మొత్తం లక్షా 61 వేల వియల్స్ ఇవ్వనుంది.
- Advertisement -