సజావుగా రేషన్ బియ్యం పంపిణీ: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

125
srinivas reddy

రేషన్ బియ్యం పంపిణీ సజావుగా సాగుతోందని తెలిపారు సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. సిద్ధిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం లోని గౌరారం,అక్కారం,జగదేవపూర్, కుకునూరు పల్లి గ్రామాల్లో పర్యటించి రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కరోనా నేపధ్యం లో పేద ప్రజలెవరూ ఆకలితో అలటించకూడదనే ఉద్దేశ్యం తో సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. దేశం లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలకు అనాధలకు కూడా ఉచితంగా బియ్యం, 5 వందల రూపాయల నగదు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మరో నాలుగైదు రోజుల్లో 1500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం అని….ఇప్పటికే రాష్ట్రం లో 50 శాతం బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు.

కరోనా వ్యాప్తి చెందకుండా రేషన్ షాప్ ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని…సిద్ధిపేట జిల్లాలో బియ్యం పంపిణీ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా,జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని.. ప్రభుత్వ రంగ సంస్ధల ద్వారా అన్ని గ్రామాల్లో రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేస్తాం అన్నారు.

ధాన్యం కొనుగోళ్ల కోసం సీఎం కేసీఆర్ 30 000 కోట్ల రూపాయల నిధిని సమకూర్చారని… రైతులెవరూ ఆందోళన చెందవద్దు..క్రమశిక్షణతో తమ ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు.