ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత కరెంట్

2
- Advertisement -

ప్రభుత్వ విద్యాసంస్థలు ఒక్క రూపాయి కరెంటు బిల్లు కూడా కట్టాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం…పేద వాళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అని వెల్లడించారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు కూడా ఉచిత విద్యుత్ అందించాలని ఆదేశాలు ఇచ్చాం అని చెప్పారు.

చిలుకూరులోని గురుకుల పాఠశాలను సందర్శించిన సీఎం…విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై సీరియస్ అయ్యారు. శ్రీమంతుడికైనా, పేదవాడికైనా వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుందని స్పష్టం చేశారు.

మనల్ని నమ్మి వాళ్లు హాస్టళ్లకు పంపితే.. మనం ఎంత బాధ్యతగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. ఇది మన గౌరవ ప్రతిష్టలను పెంచేదా..? తగించేదా..?,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని నిర్ణయించాం అన్నారు సీఎం.

Also Read:ఎక్కడికి పారిపోలేదు: మోహన్ బాబు

- Advertisement -