ఉద్యోగులకు ఫ్రీ మెడిసిన్స్‌..కేసీఆర్ వరాలు

243
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కారు. ఇప్పటికే ఉద్యోగులపై వరాల జల్లు కురిపిస్తున్న సీఎం కేసీఆర్…ఇకనుంచి వారికి జీవితాంతం ఉచితంగా మందులు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేగాదు ఉద్యోగులు…వారి కుటుంబ సభ్యులకు అవసరమైన మందులను జీవితాంతం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌లో మార్పులు చేయాలని నిర్ణయించారు.

వచ్చే నెల మొదటి వారం నుంచి అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగులకు వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓపీ సర్వీసులో భాగంగా అవసరమైన టెస్టుల కోసం ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లతో అగ్రిమెంట్ చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అవసరాన్ని బట్టి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకునేందుకు అవకాశముంది. అలాగే ఉద్యోగులు.. వారి కుటుంబ సభ్యులకు ఏడాదికోసారి కార్పొరేట్ ఆస్పత్రుల్లో పూర్తి స్థాయి వైద్యపరీక్షలను ఉచితంగా చేయించుకునుందుకు అవకాశం ఇవ్వనున్నారు. 700 రకాల మందులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఉద్యోగులు తమకు అవసరమైన మందులను ఉచితంగా పొందవచ్చు.

online news portal

ఒక్కసారి కానీ ఈ వరం కానీ అధికారికంగా వెల్లడైతే.. ప్రభుత్వ ఉద్యోగుల ఆనందానికి అంతు ఉండదని చెప్పొచ్చు. ఇవాల్టి రోజు వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోవటంతో పాటు.. చాలామంది నిత్యం మందుల్ని వాడాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడతుంది. ఇక.. వృద్ధులు.. పెద్ద వయస్కులకు ఇలా మందులు వాడటం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతోంది. దీంతో.. వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి.

online news portal

తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్లుగా చెబుతున్న ఈ నిర్ణయంతో అలాంటి సమస్యలకు చెక్ పెట్టటమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించి భారీ భరోసా దక్కినట్లుగా అవుతుందని చెప్పొచ్చు. కేసీఆర్ తాజా నిర్ణయం రాజకీయంగానూ కీలకమైనదిగా విశ్లేషకులు చెబుతున్నారు. తాజా స్కీంతో తెలంగాణ ఉద్యోగులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కావటమే కాదు.. మిగిలిన రాష్ట్రాల ఉద్యోగులు సైతం ఇదే తీరులో తమకు కూడా వసతి కల్పించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని చెప్పక తప్పదు.

- Advertisement -