AP:గిరిజనులకు ఉచిత సిలిండర్లు

4
- Advertisement -

ఏపీలో గిరిజన కుటుంబాలకు మరో శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం. గిరిజనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. దీపం-2 పథకం కింద 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.

దీని వల్ల 16 జిల్లాల్లోని 23,912 గిరిజన కుటుంబాలు లబ్ధి పొందుతాయని పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వంపై రూ.5.54 కోట్ల భారం పడుతుందని తెలిపారు. కాగా, గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలు 5 కేజీల ఎల్పీజీ సిలిండర్లు వినియోగిస్తుండటంతో వారు ఉచిత సిలిండర్ ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు.

Also Read:TTD:అనంత పద్మనాభ వ్రతం

- Advertisement -