సైబర్ నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. ఈసారి ఏకంగా పోలీస్ కమిషనరేట్ అధికారిక వెబ్‌సైట్లనే హ్యాక్ చేయడం సంచలనం రేపుతోంది. గత 10 రోజులుగా సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్లు పనిచేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరిగిన పరిశీలనల్లో ఈ రెండు వెబ్‌సైట్లు హ్యాక్ అయ్యాయనే విషయం వెలుగులోకి వచ్చింది.
ఇటీవలే హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్ ఘటన చోటు చేసుకున్న సందర్భంలో, ఇప్పుడు పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్లు కూడా హ్యాకర్ల బారిన పడటం. సైట్‌లో ఉన్న లింకులు ఓపెన్ చేయగానే బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఇది హ్యాకర్లు సైట్‌లోని కోడ్‌ను మార్చి, యూజర్లను అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్ ఫారాలకి మళ్ళించారు.
ఈ పరిస్థితి అత్యంత సీరియస్‌గా మారడంతో ఐటీ విభాగం వెంటనే సర్వర్లను డౌన్ చేసి భద్రతా చర్యలను చేపట్టింది. డేటా సెక్యూరిటీ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ సమస్యను మూలానికి చేరుకొని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక హ్యాకింగ్ ముఠాలను గుర్తించేందుకు NIC బృందం సైబర్ క్రైమ్ పోలీసులతో సమన్వయం చేస్తోంది. సర్వర్ లాగ్‌లు, ట్రాఫిక్ మూలాలు, మాలిషియస్ కోడ్ విశ్లేషణ జరుపుతూ నేరగాళ్లను గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వ, న్యాయ, పోలీస్ వంటి కీలక రంగాలపై వరుసగా సైబర్ దాడులు జరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి దాడులను నిరోధించేందుకు మరింత శక్తివంతమైన సైబర్ భద్రతా వ్యవస్థ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:మోనాలిసా.. ‘లైఫ్’ మొదటి షెడ్యూల్

