- Advertisement -
లక్కీ భాస్కర్ సినిమా స్టయిల్ లో మోసం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎస్బీఐ బ్యాంక్ లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఎస్బీఐ బ్యాంక్ ఆడిట్ లో భారీగా అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.
సుమారు 3 నుంచి 4 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. బ్యాంకులో విచారణ చేపట్టారు పోలీసులు. బ్యాంకు క్యాషియర్ రవీందర్ పరారీలో ఉన్నాడని సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు.
కొంత బంగారం, నగదు కూడా కనిపించలేదని సీపీ తెలిపారు. సీసీ ఫుటేజీ, రికార్డులు, ఆడిట్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also Read:జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు!
- Advertisement -

