- Advertisement -
యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాకర్ ఫైనల్ పోరు ఇవాళ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌తో తలపడనుంది అర్జెంటీనా. ఈ సారి కప్పు కొట్టి.. ఫుట్‌బాల్ మాంత్రికుడు డిగో మారడోనాకు ఘనమైన నివాళి అర్పించాలని ఉవ్విళ్లూరుతోంది అర్జెంటీనా.
వాస్తవానికి ఆరేండ్ల క్రితమే ఆటకు వీడ్కోలు పలకాలనుకున్న అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని ఇప్పటికే ప్రకటించగా.. కిలియన్ ఎంబాపే.. ఫ్రాన్స్‌కు వరుసగా రెండో టైటిల్ అందించాలని పట్టుదలతో ఉన్నాడు.
ప్రతిష్ఠాత్మక గోల్డెన్ బూట్ రేసులోనూ మెస్సీ, ఎంబాపే చెరో ఐదు గోల్స్‌తో ముందున్నారు. ఇప్పటికే అర్జెంటీనా, ఫ్రాన్స్ చెరో రెండుసార్లు ప్రపంచకప్ కైవసం చేసుకోగా.. మూడోసారి కప్పును ముద్దాడేదెవరో నేడు తేలనుంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -