ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ పై అర్జెంటీనా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఇరు జట్లు డ్రా దిశగా సాగాయి. కానీ షూటౌట్ ద్వారా అర్జెంటీనా 4గోల్స్ చేసి విశ్వవిజేత నిలిచింది.
Not the moment, mate: Mbappé and Deschamps both completely blank President Macron pic.twitter.com/bpOxpQOhD6
— Jeremy Vine (@theJeremyVine) December 18, 2022
మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగుతున్న సమయంలో ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపే చివరి నిమిషం వరకు గోల్స్ సాధించారు. ఫైనల్ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించారు. ప్రతి ప్రేక్షకుడి మదిలో గుండెలో రైలు పరుగెత్తించిన ఆటగాడిగా నిలిచింది మాత్రం ఎంబాపానే. హ్యాట్రిక్ గోల్స్‌తో అర్జెంటీనాకు ఓ దశలో షాక్ ఇచ్చాడు.
మెస్సి తరహాలోనే ఎంబాపే చివరి వరకు పోరాటం చేశాడు. ఏ దశలోనూ ఎంబాపే పట్టు వదలలేదు. గోల్‌పోస్టును టార్గెట్ చేస్తూనే ఫ్రాన్స్ అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ ఫ్రాన్స్ చేయి దాటిపోవడంతో ఫ్రాన్స్ అభిమానులు నిరాశ గురయ్యారు. ఈ మ్యాచ్‌ను అధ్యక్షుడు ఎమాన్యూవల్ మాక్రన్ ప్రత్యక్షంగా వీక్షించారు.
Fiers de vous. pic.twitter.com/9RMjIGMKGU
— Emmanuel Macron (@EmmanuelMacron) December 18, 2022
ఫ్రాన్స్‌కు విక్టరీని అందించేందుకు ఎంబాపే విశ్వప్రయత్నమే చేశాడు. హ్యాట్రిక్ కొట్టినా ఓటమి తప్పకపోవడంతో అతను నిరాశకు గురయ్యాడు. మైదానంలో కూర్చుండిపోయిన ఎంబాపే దగ్గరకు అధ్యక్షుడు మాక్రన్ వెళ్లి కలిశారు. ఎంబాపేను ఓదార్చే ప్రయత్నం చేశారాయన.
డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఆటగాళ్లను ఉత్తేజపరిచారు. మరియు మీఆట తీరు వల్ల కోట్లాది మందిని మీరు థ్రిల్ చేశారని మాక్రన్ అన్నారు. ఈ సందర్భంగా ఎంబాపేను ఆలింగనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి…