కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురిచేస్తుంది. ఇండియాలో ఇప్పటికే 103మంది ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు కరోనా వల్ల మరణించారు. కరోనా వైరస్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించకుండా తెలంగాణ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోంది.
ఇప్పటికే గాంధీ మెడికల్ కళాశాలలోని వైరాలజి ల్యాబ్‌లో కరోనా పరీక్షలను నిర్వహణ కోసం ల్యాబ్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నగరంలోని మరో నాలుగు కేంద్రాల్లో ఒఎంసి, నిమ్స్, ఫీవర్ హాస్పిటల్, ఐపీఎంలలో కరోనా ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. రోజూ ప్రతి షిప్టుకు 30-40మందికి పరీక్షలు చేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షల కోసం 6మందితో ప్రత్యేక వైద్యబృందాని ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.