ఫార్ములా ఈ…వాస్తవాలివే!

4
- Advertisement -

ఫార్ములా ఈ రేసుపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ అక్రమ కేసులను సైతం బనాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం.ఇక ఈ కేసులను లీగల్‌గా ఎదుర్కొనేందుకు రెడీ అయింది బీఆర్ఎస్. అసలు ఫార్ములా ఈలో అవినీతే లేనప్పుడు స్కామ్ ఎట్లయితది, ఏసీబీ కేసు ఎట్లయితదని అంతా ప్రశ్నిస్తున్నారు.

ఫిబ్రవరి 2023లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన EV సమ్మిట్ వారం ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఇమేజ్‌ని పెంచి, వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. దీని లక్ష్యం రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 5 సంవత్సరాలలో 4 లక్షల ఉద్యోగాలు సృష్టించడం.

హైదరాబాద్‌లో జరిగిన 2023 ఫార్ములా-E రేసు నగరానికి ₹700 కోట్ల ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించిందని నీల్సన్ నివేదిక పేర్కొంది. HMDA స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ, ఆనాడు MA&UD మంత్రి KTR వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. 2024లో రేసును నిర్వహించడం కోసం FIAకి ₹55 కోట్లు విడుదల చేసింది HMDA.దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేసును రద్దు చేసింది, తద్వారా FIAతో ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

ఈ ఎపిసోడ్‌లో అవినీతి ఎక్కడ ఉంది. నిజానికి ఫార్ములా-E ను రద్దు చేస్తూ రేవంత్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు ₹55 కోట్ల నష్టం వాటిల్లింది, ఇది ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసింది మరియు EV హబ్‌గా ఎదుగుతున్న తెలంగాణకు బ్రేకులు వేసింది.

Also Read:నాడు ధనయజ్ఞం…నేడు జలయజ్ఞం అయిందా: హరీశ్‌

- Advertisement -